లైక్ ల పిచ్చోళ్లకు ఇది ఓ హెచ్చరిక..! - MicTv.in - Telugu News
mictv telugu

లైక్ ల పిచ్చోళ్లకు ఇది ఓ హెచ్చరిక..!

June 22, 2017

ఫేస్ బుక్ , వాట్సాప్ ,ట్విట్టర్ సైట్లను గంటలకొద్దీ చూస్తున్నారా.. చూస్తే చూడండి అది మీ ఇష్టం..లైక్ ల పిచ్చిలో ఏది పడితే చేస్తే మాత్రం చిప్పకూడు తప్పదు. లైక్ లకు జైలు లింకు ఏంటీ అనుకుంటున్నారా.. ఉంది మరి.లైక్ ల పిచ్చి పీక్స్ కు చేరిన ఓవ్యక్తి ఏం చేశాడంటే…

మార్నింగ్ లేస్తే సోషల్ మీడియాతో గుడ్ మార్నింగ్. రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్..మధ్యలో రోజంతా చేసిన పనుల గురించి పోస్టింగ్ లు , ఫోటోల్ని కొందరు అదేపనిగా సోషల్ సైట్లలో పెట్టేస్తారు. లైక్ ల పిచ్చిలో మరి కొందరు సోయి లేకుండా ఏదీ పడితే అదే పెట్టేస్తుంటారు. ఇలా అల్గేరియాకు చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారి టీషర్టు మాత్రమే పట్టుకొని 15 అంతస్తుల భవనం బాల్కనీ నుంచి వేలాడదీశాడు. సోషల్‌మీడియాలో ఈ ఫొటో పెడుతూ ‘నాకు వెయ్యి లైకులు ఇవ్వండి లేదంటే చిన్నారిని వదిలేస్తా’నంటూ పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కంగారు పడ్డారు. చిన్నారిని హింసిస్తున్నాడని పోలీసులకు కంప్లయింట్ చేయడంతో అతన్ని అరెస్టు చేశారు.

అయితే సరదాగా అలా చేశానని.. ఫొటో తీసినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాని అతను పోలీసులకు చెప్పాడు. ఆ చిన్నారి తండ్రి కూడా కేవలం సరదా కోసం అలా చేశాడని కోర్టుకు తెలిపాడు. అయినా.. ఫొటోలో చిన్నారిని ప్రమాదకరమైన పరిస్థితిలో పట్టుకున్నాడని నిర్ధారిస్తూ జడ్జి అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

సో సోషల్ మీడియాలో సోయి లేకుండా చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. ఇతను ఒక్కడే కాదు చాలా మంది ఇలా చేస్తున్నారు. కాకపోతే పోస్టింగ్ ల మాయలో కొట్టుకుపోతున్నారు. ఇప్పటికైనా జరజాగ్రత్తగా ఉండండి..లేదంటే చిప్ప కూడు తప్పదు..