కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజూ లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. దాదాపు 70 నుంచి 80 వేల మంది వరకు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. అయితే ఈ క్రమంలో నాయీ బ్రాహ్మణులు వ్యక్తికి కొత్త బ్లేడు మారుస్తారు కానీ, కత్తిని మాత్రం మార్చరు. సగటున ఒక్కో నాయీ బ్రాహ్మణుడు రోజుకు 800 వరకు కేశఖండన చేస్తారు. కత్తిని కనీసం డెటాయిల్తో కూడా శుభ్రం చేయకపోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
దీంతో కత్తి స్థానంలో డిస్పోజబుల్ షేవింగ్ రేజర్లను వాడాలని ఓ సామాజిక కార్యకర్త టీటీడీకి ప్రతిపాదించారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన తోట శ్రీనివాస్ భక్తుల అభిప్రాయాలను సేకరించి పై ప్రతిపాదన చేశాడు. మరి దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.