హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్.. ఎందుకంటే?

April 1, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కొండపనేని మాన్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ, మరోవైపు గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఆమెను పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘మాన్సీ భర్త మదన్ మనేకర్‌తో కలిసి గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్‌పల్లి పోలీసులు గుర్తించారు. కొండపనేని మాన్సీ ఓ ఐటీ సంస్థలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. అయితే, ఐటీ రంగంలో పెద్ద ఎత్తున గంజాయికి డిమాండ్ ఉందని ఆమె గుర్తించింది. దీంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని, అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తోందని తెలిపారు.

మరోపక్క గత నెలలో పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి విక్రయిస్తున్న ఓ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఇద్దరు యువకులతో ఉన్న మాన్సీ, మనేకర్ పారిపోయారు. ఈ క్రమంలో తాజాగా మాన్సీని మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాన్సీ పూర్వీకులు తెలుగువారే. వారు చాలాకాలం కిందట మహారాష్ట్రలోని నాగపూర్‌లో స్థిరపడినట్లు సమాచారం.