అతడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో ఓ కాల్‌గర్ల్ కోసం వెతికాడు. ఫోటోలో హాట్‌గా కనిపించిన అందమైన అమ్మాయిలందరికీ అతని నుంచి రిక్వెస్ట్‌లు వెళ్లాయి. చివరికి ఓ వెబ్సైట్లో లింకు క్లిక్ చేయగానే ఓ వాట్సాప్ నెంబర్ దొరికేసింది. ఇంకా వారితో మాటలు కలిపాడు. అవతలి వ్యక్తి పటేల్ చార్మి పేరుతో పరిచయం చేసుకొని వాట్సాప్ ద్వారా కొందరి అమ్మాయిల ఫోటోలను షేర్ చేశాడు. వాటిని చూసి ఆగలేకపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అతను అడిగిన పేమెంట్లను చేశాడు.
ముందుంగా బుకింగ్ కోసం రూ.510, తరువాత రూ.5,500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో రూ.7800..ఇళా రకరకాల కారణాలు చెప్పి మొత్తం గుంజేశాడు. సుమారు రూ.1.97 లక్షలు కాజేశాడు. అయినా అమ్మాయి విషయం చెప్పకుండా
ఇంకా డబ్బులు కోసం అడగడంతో చివరికి మోసపోయినట్లు గ్రహించాడు. అనంతరం సైబర్ బాద్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు సూచనలు, అవగాహన కార్యక్రమాలు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలేకపోతున్నాయి. బాగా తెలివైన వారు, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు వంటి వారినే సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు.ప్రజల బలహీనతలను క్యాచ్ చేసుకొని తెలివిగా డబ్బులు గుంజేస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని రోజు రోజు కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైం ద్వారా ప్రతీసారీ పోలీసులకు కొత్త సవాల్ ఎదురవుతునే ఉంది.