ప్రేమవివాహం చేసుకున్న 20రోజులకే.. టెక్కీ అనుమానాస్పద మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమవివాహం చేసుకున్న 20రోజులకే.. టెక్కీ అనుమానాస్పద మృతి

December 4, 2019

poorninma01

హైదరాబాద్‌‌లో మరో దారుణం జరిగింది. సనత్ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్ణిమ 20 రోజుల క్రితం కార్తీక్‌‌ను ప్రేమవివాహం చేసుకొంది. వీరిద్దరూ సనత్‌నగర్‌లో ఉంటున్నారు. పెళ్లైన 20 రోజులకే పూర్ణిమ అనుమానాస్పదంగా మృతి చెందడంపై పూర్ణిమ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్ణిమను కార్తీక్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. పూర్ణిమ మరణానికి కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్ణిమ ఓ పారిశ్రామికవేత్త కూతురు. హైదరాబాద్‌లో వారికి ఓ ఫ్యాక్టరీ ఉంది. తమ ఫ్యాక్టరీలో పనిచేసే కార్తీక్‌ను పూర్ణిమ ప్రేమవిహవాం చేసుకుంది. ఈ విషయమై తల్లిదండ్రులతో పూర్ణిమ గొడవకు దిగింది. ఈ గొడవ పోలీస్ కేసుల వరకూ వెళ్లింది. పూర్ణిమకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్తీక్‌తోనే ఉంటానని పూర్ణిమ పోలీసుల కౌన్సిలింగ్‌లో తెలిపింది. దీంతో పూర్ణిమ సనత్ నగర్‌లో కార్తీక్‌తో కలిసి ఉంటుంది.