దుమ్మురేపిన సోహెల్.. కొత్త మూవీ ప్రీ లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

దుమ్మురేపిన సోహెల్.. కొత్త మూవీ ప్రీ లుక్

March 3, 2021

vfdv

బిగ్‌బాస్ షోతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కుర్రనటుడు సోహెల్ పక్కా మాస్ లుక్‌తో హల్ చల్ చేస్తున్నాడు. క్యూట్‌గా ఉండే సోహెల్ రఫ్ అండ్ టఫ్ మాచో లుక్స్‌తో సరికొత్తగా బయటికొచ్చాడు. మైక్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3 కింద నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోహెల్ పోస్టర్‌ను విడుదల చేశారు. చేతికి బ్యాండ్లు, మోచేతులపై పచ్చబొట్లు, ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో టాటూ మిషప్ పైప్ పట్టుకుని సీరియస్ గా చూస్తున్నాడు. సోహెల్‌‌ను కొత్త గెటప్‌తో, కొత్త వెంచర్‌లోకి తీసుకెళ్తున్నట్లు మూవీ టీఎం తెలిపింది.

‘జార్జిరెడ్డి’,‘ప్రెజర్ కుక్కర్’చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సజ్జల రవిరెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో చిన్నతరహా పాత్రలు పోషించిన సోహెల్‌కు హీరోగా ఇదే తొలిచిత్రం. శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీవీ సీరియళ్లలో నటించిన సోహెల్ బిగ్ బాస్ షో ద్వారా తెలియని వారికి కూడా తెలిసిపోయాడు. కంటెస్ట్‌లో ఫైనల్‌‌‌కు రాకుముందే తనకు ఆఫర్ చేసిన ప్రైజ్ మనీ తీసుకుని బయటికొచ్చిన సోహెల్ తన మనసుకు నచ్చినట్టే చేశాడని, అతనిలో నిజాయతీ ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.