Home > Featured > వెంటాడి మరీ కొడతా నాకొడకల్లారా.. సోహెల్ వార్నింగ్..

వెంటాడి మరీ కొడతా నాకొడకల్లారా.. సోహెల్ వార్నింగ్..

Sohel warns those who post bad comments

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. నటీ, నటులు మాట్లాడిన మాటలను, ప్రవర్తనను కొంతమంది తప్పుగా చూపిస్తున్నారు. ఫ్యాన్స్ వార్‌లో భాగంగా నచ్చని హీరోలపై అసభ్యకర కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు సెలబ్రెటీలు సైతం ఇబ్బంది పడాల్సి పరిస్థితి నెలకొంది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్‌నే ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలోనే నటుడు బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కూడా ఉన్నారు. బిగ్ బాస్‌ ఫైనల్స్‌లో డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసిన సోహెల్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో అతడు హీరోగా మారిన తరువాత కూడా నెగెటివిటీ ఎక్కువైంది. సోషల్ మీడియాలో సోహల్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్యాడ్ కామెంట్లు పెట్టడం జరగుతున్నాయి. దీనిపై తాజాగా సోహెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాడ్ కామంట్లను పెట్టిన వారిని వెతకబట్టి కొడతానని హెచ్చరించాడు. తనను ఏమన్నా పర్వాలేదని కానీ తన తల్లిదండ్రులను కొంతమంది తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాండ్ కామెంట్లు చేసిన వారిని ‘దొరకబట్టి తరిమి తరిమి కొడతా నా కొడకల్లారా’ అంటూ సోహెల్ వార్నింగ్ ఇచ్చాడు.

బిగ్‎బాస్‌లో తీసుకున్న నగదుపై కూడా సోహెల్ క్లారిటీ ఇచ్చేశాడు. "నా సోదరి వివాహం కోసం బిగ్ బాస్‌లో రూ.25 లక్షలు తీసుకున్నా. నాకు వేసిన వారి ఓట్ల వృథా కాలేదు. . ఆ డబ్బుతో నా సోదరి పెళ్లి చేశాను. పెద్ద స్కామ్ చేశాను. సూట్ కేసుతో బయటకు వచ్చాను అంటున్నారు. నేను ఎవరి ఇంట్లోకెళ్లి ఎత్తుకొని రాలేదు. దొంగతనం చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు. వచ్చిన ఆఫర్‎ను వినయోగించుకున్నా. మా లాంటి మధ్యతరగతి వాళ్లకు రూ.25 లక్షలు అంటే రూ.2 కోట్లుతో సమానం" అని సోహెల్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తతం సోహెల్ హీరోగా ‘లక్కీ లక్ష్మణ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డిసెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సోహెల్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. తన కష్టం వెనుక తన తండ్రి కష్టం ఉందని ఎమోషనల్ అయ్యాడు.

Updated : 29 Dec 2022 5:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top