సూర్యగ్రహణం నేరుగా చూశారు.. చివరికి ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యగ్రహణం నేరుగా చూశారు.. చివరికి ఇలా.. 

January 22, 2020

nnhhg

గ్రహణాన్ని నేరుగా చూస్తే కంటి సమస్యలు వస్తాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ దీన్ని పట్టించుకోకుండా కొంత మంది ఎలాంటి ఉపకరణాలు లేకుండా నేరుగా చూస్తారు. ఇలా నేరుగా సూర్యగ్రహణం చూసిన 15 మంది కంటి సమస్యలు తెచ్చిపెట్టుకున్నారు. రాజస్థాన్‌లో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెటీనా పూర్తిగా మాడిపోవడంతో వారి కంటి చూపు దెబ్బతిందని వైద్యులు వెల్లడించారు. 

డిసెంబరు 26న ఆకాశంలో ఏర్పడిన సూర్యగ్రహణాన్ని చూసిన 15 మంది యువకులు కంటి సమస్యలకు గురయ్యారు.సూర్యుడి నుంచి వచ్చిన అతి నీలలోహిత కిరణాల కారణంగా  వారికి కంటి చూపు సమస్య ఏర్పడింది. వెంటనే ఆస్పత్రిలో చేరిన వారిని పరీక్షించిన వైద్యులు రెటీనా మాడిపోయిందని గుర్తించారు. దీని కారణంగా కంటి చూపు కోల్పోయారని తెలిపారు. భవిష్యత్తులో కూడా వారికి చూపు తిరిగి రావడానికి అవకాశాలు లేవన్నారు. ప్రజలు గ్రహణాలు చూసే సమయంలో కచ్చితంగా ఉపకరణాలను వాడాలని సూచించారు.