గ్రహణ సమయంలో భోజనాలు..! ఎవరి వాదన ఏంటంటే... - MicTv.in - Telugu News
mictv telugu

గ్రహణ సమయంలో భోజనాలు..! ఎవరి వాదన ఏంటంటే…

October 25, 2022

గ్రహణం అంటే ఒక్కటే టెన్షన్..ఇళ్లలో హడావుడి. గ్రహణ సమయానికి ఇంటికి చేరుకోవాలి. ఆ సమయంలో ఏం తినొద్దు.వండిన వంటలు వుంటే పడేయాలి. ఇల్లంతా శుభ్రం చేసి గరకపోసలు వేసుకోవాలంటారు. చాలామంది తూచతప్పకుండా పాటిస్తారు. ఇంకొందరు ఇష్టంలేకపోయిన అందరితో మనం అంటారు. ఇంకొందరు ఇవేవి పాటించరు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవిజ్ఞాన వేదిక… విద్యార్థులతో కలిసి సామూహిక భోజనాలు చేసింది. సూర్యగ్రహణంపై ఎవరి నమ్మకాలేంటి?ఖగోళశాస్త్రవేత్తలు ఏమంటున్నారు?జ్యోతిష్యులు ఏమంటున్నారు?

అరుదైన సూర్యగ్రహణం

రెండుదశాబ్దాల తర్వాత వచ్చిన అరుదైన సూర్యగ్రహణం. హైదరాబాద్‌లో 4.59గంటలకు గ్రహణం ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల 26 నిమిషాలకు ముగిసింది. ఆశ్వయుజ మాసంబహుళ పక్ష అమవాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం మొదలైంది. ప్రాంతాల్ని బట్టి స్వల్పంగా మార్పులు ఉన్నాయి. ఇది అద్భుతమైందని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ సూర్యగ్రహణాన్ని చూడొచ్చన్నారు.

రోడ్లు అన్ని ఖాళీ

గ్రహణంతో హైదరాబాద్ ,విజయవాడ,విశాఖ,తిరుపతి రోడ్లు అన్ని ఖాళీ కనిపించాయి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు ముందే ఇంటికివెళ్లిపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే సిటీరోడ్లలో జనసంచారం తగ్గింది. షాపింగ్ మాల్స్ జనం లేక వెలవెలబోయాయి.

జ్యోతిష్యుల వాదన ఇది

“గ్రహణ సమయంలో ఏం తినకూడదు. పనులు చేయకూడదు..సూర్యుని అసలే చూడొద్దు…వీటితో పాటు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి” అని జ్యోతిష్యులు చెప్పారు. గ్రహణ సమయంలో వండిన పదార్థాలు తినకూడదని వారు చెబుతున్నారు. సూచించారు. గ్రహణ సమయంలో కడుపుఖాళీగా ఉండాలంటున్నారు. వండిన ఆహార పదార్థాలపై అతినీలలోహిత కిరణాల ప్రభావం ఉంటుందన్నారు. గర్భిణీలు ఏం తినకుండా ఉండాలని, సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలని, నీళ్లు తాగాలని అనుకుంటే కొబ్బరి బొండాలు సేవించడం మేలన్నారు. ఎందుకంటే గర్భిణీలు ఎక్కువగా నీళ్లు తాగాల్సి వుంటుందని గ్రహణ సమయంలో ఇలా చేస్తే తప్పుకాదన్నారు.

గ్రహణం తర్వాత ఏం చేయాలి

గ్రహణం తర్వాత తలస్నానం తప్పనిసరిగా చేయాలంటున్నారు పండితులు. ఆహార పదార్థాలపై ఉంచిన గరకపోసల్ని తీసేయాలని, ఇంటిని శుభ్రం చేయాలని వారు చెబుతున్నారు. గ్రహణం తర్వాత దీపారాధనతో పాటు ఇతర పనులు అన్నింటినీ చేసుకోవచ్చని చెబుతున్నారు.

అయినా వాళ్లు చూసేశారు..!
సూర్యగ్రహణం ఆకాశంలో అద్భుతంగా కనిపించింది. ఎక్కువమంది టీవీ స్క్రీన్లపై వీక్షించారు. కొంతమంది టెలిస్కోప్, గ్లాసెస్ పెట్టుకుని సూర్య గ్రహణాన్ని చూశారు. విజయవాడలో సైన్స్ టీచర్లు జాగ్రత్తలు తీసుకుని మరి సూర్య గ్రహణాన్ని చూపించారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఇలా చేశామని వారు చెప్పారు.

గ్రహణంతో గుళ్లు మూసివేత

పాక్షిక సూర్యగ్రహణంతో దేశవ్యాప్తంగా ఆలయాలు మూసేశారు. మంగళవారంరోజు పూర్తిగా దర్శనాల్ని నిలిపివేశారు.బుధవారం సంప్రోక్షణ తర్వాత ఆలయాల్ని తెరుస్తారు.

గ్రహణ సమయంలో భోజనాలు..!

ఇక ఎప్పటిలాగే గ్రహణ నమ్మకాల్ని జనవిజ్ఞాన వేదిక తోసిపుచ్చింది. వీటిపై జనాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి గ్రహణ సమయంలో భోజనాలు చేసింది. ఇదంతా మూఢనమ్మకమని, గ్రహణ సమయంలో సూర్యుడ్ని చూసినా ఏం కాదని తేల్చిచెప్పింది. “భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తారు. చంద్రుడు కొంత భాగాన్ని కప్పేస్తారు. లేని రాహు, కేతువుల పేరుతో పండితులు మోసం చేస్తున్నారని జనవిజ్ఞాన వేదిక ఆరోపణలు చేసింది.