Solar eclipse: Many temples in Telangana to remain closed on Tuesday
mictv telugu

నేడే సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్ని బంద్

October 25, 2022

Solar eclipse: Many temples in Telangana to remain closed on Tuesday

నేడు సూర్య గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1:15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.

యాదాద్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8:50 నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు.వేములవాడలో రాజన్న ఆలయాన్ని, జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా మూసివేయనున్నారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత, గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు.

తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం..

తెలంగాణాలోని హైదరాబాదులో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి గ్రహణాన్ని చూడవచ్చు. ఇక విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల1 నిమిషాల సమయంలో గ్రహణాన్ని చూడవచ్చు.