Sold 3 acres with debts and now bought 16 acres : Hyper Aadi
mictv telugu

అప్పులతో 3 ఎకరాలు అమ్మి ఇప్పుడు 16 ఎకరాలు కొన్నా : హైపర్ ఆది

July 14, 2022

జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ద్వారా సూపర్ సక్సెస్ అయిన టీం లీడర్లలో హైపర్ ఆది ముందుంటాడు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం జబర్దస్త్‌కు ముందు, తర్వాత ఎలా మారిపోయిందో వివరించాడు. ‘జబర్దస్త్‌కు రాకముందు నా కుటుంబానికి రూ. 20 లక్షల అప్పు ఉండేది. అప్పుడే నేను షోలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నా. అప్పులతో మానసికంగా ఇబ్బంది ఫీలయి సరిగ్గా ఏకాగ్రత నిలిచేది కాదు. దాంతో ఏదైతే అదయిందని ఆలోచించి మాకున్న మూడెకరాలు అమ్మేసి అప్పు తీర్చేసా. తర్వాత మైండ్‌లో ఏ ఆలోచన పెట్టుకోకుండా జబర్దస్త్ మీద ఫోకస్ పెట్టా. ఇప్పుడు చూస్తే మా ఊర్లో 16 ఎకరాలు కొన్నా. అదీకాక, సక్సెస్, డబ్బు ఇచ్చే ఆత్మవిశ్వాసం ఇంకేదీ ఇవ్వలేదు’ అని తన గతం గురించి చెప్పుకొచ్చాడు.