ఆ కారు ధర 1,108 కోట్లు.. ఎందుకంత? - MicTv.in - Telugu News
mictv telugu

ఆ కారు ధర 1,108 కోట్లు.. ఎందుకంత?

May 21, 2022

టాలీవుడ్ హీరోలు రెండు మూడు కోట్ల కార్లు కొంటేనే లోకం కోడై కూస్తోంది. పడవలంత కార్లు అని ఇదివరకు చెప్పునునేవాళ్లు గర్వంగా. కారును లగ్జరీగా చిహ్నంగా భావించడం వల్ల వాటి ధరలు అంతరిక్షాన్ని తాకేస్తున్నాయి. అరుదైన కార్ల సంగతైతే చెప్పక్కర్లేదు. కొత్త కార్లే కాదు, వ్యాల్యూ ఉన్న పాత కార్లకూ ధర ఎక్కువే. తాతల నాటి ఓ కారు ఏకంగా రూ. 1,108 కోట్ల భారీ ధరకు అమ్ముడుబోయి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా రికార్డుకెక్కింది.
ఆర్ఎం సోతెబీ సంస్థ ఇటీవల కెనడాలో నిర్వహించిన వేలంలో మెర్సిడెస్ బెంజ్ కారు రికార్డు ధరకు అమ్ముడుబోయింది. 1955 నాటి వింటేజ్ మెర్సిడిస్ బెంజ్ క్లాసిక్ 300 ఎస్ఎల్ఆర్ అలెన్హాట్ కూప్‌ను వేలం వేయగా గుర్తు తెలియని వ్యక్తి రూ.1,108 కోట్లు బిడ్ గెలుచుకున్నారు. 3 లీటర్ల ఇంజిన్ కెపాసిటీ ఉన్న ఈ కారును ప్రీ రేసింగ్ కోసం తయారు చేశారు. గంటకు 290 కి.మీ. వేగంతో వెళ్తుంది.

రేసర్ జువాన్ మాన్యుయెల్ ఫాంజియో దీన్ని నడిపే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయారు. ప్రస్తుతం ఇలాంటి కార్లు రెండే ఉన్నాయి. మరొకటి బెంజ్ స్టట్గార్ట్ మ్యూజియంలో ఉంది. ఈ కారు అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ సైన్స్, కర్బన ఉద్గారాల తగ్గింపుపై పరిశోధనలు చేయడానికి ఉపకార వేతనాలు ఇస్తారు.