కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 16, 2019

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రమూకలు మళ్ళీ రెచ్చిపోయాయి. గురువారం తెల్లవారుజామున భద్రతా దళాలకు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సందీప్ అనే ఆర్మీ జవాన్‌ వీరమరణం పొందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో దాలిపొర ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

Soldier Killed, 3 Terrorists Shot Dead In Encounter In J&K Pulwama

ఈ అంశమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘దాలిపోర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాము. కార్డన్‌ సర్చ్‌ సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా.. సందీప్ అనే ఆర్మీ అధికారి వీరమరణం పొందాడు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని’ తెలిపారు.