పైల్స్ అనేది చెప్పుకోలేని సమస్య. దీని రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు నలుగురిలో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు మూత్రాశయంలో విపరీతమైన వాపు ఉంటుంది. పురీషనాళం లోపల అంతర్గత హేమోరాయిడ్స్ సంభవిస్తాయి. ఇది పురీష నాళం నుంచి రక్తస్రావం, స్టూల్ పాస్ చేసేటప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ పైల్స్ చాలా బాధాకరంగా ఉంటాయి. పైల్స్ చికిత్సకు ఎన్నో ప్రభావవంతమైన ఎంపికలు ఉన్నాయి. చాలామంది ఇంటి నివారణలు, జీవన శైలిలో మార్పులతో ఉపశమనం పొందుతారు. అయితే ముల్లంగిలో అధిక ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది పైల్స్ సమస్యను నివారిస్తుంది. పైల్స్ నివారించడానికి ముల్లంగిని తీసుకోవడం ఎంత వరకు మేలు చేస్తుందో తెలుసుకుందాం.
పైల్స్ నొప్పిని తగ్గిస్తుంది:
రాప్నిన్, గ్లూకోసిలినేట్స్, విటమిన్-సి వంటి మెటాబోలైట్‌లు ముల్లంగిలో అధికంగా ఉంటాయి. ఇవి పైల్స్ వల్ల వచ్చే వాపు , నొప్పి నుంచి ఉపశమనాన్నిస్తాయి. వోలేటైల్ ఆయిల్ ముల్లంగిలో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని తీసుకుంటే మలద్వారం వాపు తగ్గుతుంది.
దురదకు చెక్ పెడుతుంది:
ముల్లంగి పైల్స్‌లో దురద, నొప్పికి చెక్ పెడుతుంది. ముల్లంగిని ఉదయాన్నే తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. పైల్స్ ఉన్నవారు ముల్లంగి ఆకులను ఎండబెట్టి, దానితో పొడి చేసి రెండు చెంచాల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసినట్లయితే పైల్స్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ఇక ముల్లంగిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనంతోపాటు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ముల్లంగి డైటరీ ఫైబర్ కు అద్భుతమైన మూలం.ఈ ఫైబర్ మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. మీ కుటుంబంలో ఎవరైన పైల్స్ తో బాధపడుతుంటే ముల్లంగిని తప్పకుండా ఇవ్వండి.