వీటిని అస్సలు ఫ్రిజ్ లో ఉంచకూడదు! - MicTv.in - Telugu News
mictv telugu

వీటిని అస్సలు ఫ్రిజ్ లో ఉంచకూడదు!

November 28, 2022

ఆహారం తాజాగా చాలారోజులు ఉండాలంటే వాటిని ఫ్రిజ్ లో పెట్టడం మామూలే. కానీ కొన్నిటిని ఫ్రిజ్ లో పెట్టకడదని మీకు తెలుసా? వాటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మనం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నట్లే! మార్కెట్ నుంచి కూరగాయలు, పండ్లు తీసుకురాగానే వాటన్నిటినీ సర్ది ఫ్రిజ్లో పెట్టడం మామూలే. రోజు మార్కెట్ కి వెళ్లలేని వాళ్లు అలాగే చేయాలి మరి. కానీ కొన్నిటినీ తెలియకుండా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకోండి. మరి వేటిని ఫ్రిజ్లో పెట్టకూడదో చదువండి.
_ ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఆలుగడ్డలను అందులో పెట్టడం వల్ల పిండి కాస్త చక్కెరగా మారుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రాణాంతకం. అందుకే ఆలుగడ్డలను ఒక పేపర్ బ్యాగులో వేసి తెరిచి ఉంచాలి.

_ టమాటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని ఫ్రిజ్లో ఉంచుతుంటారు. కానీ చల్లని వాతావరణానికి టమాటాలు కుళ్లిపోతాయి. అలా కుళ్లిన వాటిని వండడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
_ ఇతర పండ్లతో పాటు.. అరటి పండ్లను ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ అరటి పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి చల్లదనానికి తొందరగా రంగు మారిపోతాయి. కాబట్టి వాటిని కూడా పెట్టకూడదు.
_ తేనె చెడిపోతుందని భయంతో ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అలా చేయకూడదు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తేనెలో ముడి ఏర్పడుతుంది. రుచి నాశనం అవుతుంది. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది.
_ కీరదోస, దోసకాయలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలో ఉంచితేనే బాగుంటారు. కాస్త చల్లగా ఉన్నా కూడా ఇవి చెడిపోతాయి. అంతేకాదు.. అరటి, పుచ్చకాయలతో కూడా వీటిని నిల్వ చేయకూడదు.
_ తులసి, పార్ల్సీ, కొత్తిమీరలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఎక్కువ సమయం ఇవి ఉండడం వల్ల నల్లగా మారి కుళ్లిపోతాయి. వీటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి బయట ఉంచడం మేలు. లేకపోతే ఎప్పటికప్పుడు కొనుక్కోవడం ఉత్తమమం.