కూరగాయలు తినడం చాలా మంచిది. ఇది అందరికీ తెలిసింతే. చాలా మంది పచ్చి కూరలనే తింటారు కూడా. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు కూడా పచ్చి కూరలు తినాలని సలహాలు ఇస్తారు. అయితే కొన్ని కూరగాయలను పచ్చిగా తినకపోవడమే మంచిదిట. తాజాగా వెలువడిని అధ్యయనాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కొన్ని కూరగాయల్లో టాక్సిన్స్ ఉంటాయి. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
క్యారెట్లు.
క్యారెట్ తిననివారు ఉండరు సాధారణంగా. చాలా మంది పచ్చిగానే తినేస్తారు. కానీ WHO ప్రకారం.. క్యారెట్లు, సెలెరీలో ఫ్యూరోకౌమరిన్స్ అనే విష పదార్థం ఉంటుంది. క్యారెట్, సెలెరీని పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువగా తింటే.. కడుపు, పేగులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి టాక్సినే నిమ్మకాయ, ద్రాక్షపళ్ళల్లోకూడా కనిపిస్తుంది అని చెబుతున్నారు.
రాజ్మా…
చిక్కుళ్లలో లెక్టిన్స్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది ఎర్ర రంగు రాజ్మాలో ఎక్కువగా ఉంటుంది. ఎర్ర రాజ్మా పచ్చిగా తింటే.. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఎండిన బీన్స్‌ను కనీసం 12 గంటలు నానబెట్టి, కనీసం 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టినప్పుడు లెక్టిన్లు నాశనం అవుతాయి. ఇది ఒక్క రాజ్మాకే కాదు ఎండిన ఎలాంటి బీన్స్ లేదా గింజలను తిన్నా ఇదే ప్రమాదం ఉందిట. అందుకే చనా, సోయాలాంటివి ఏవి తిన్నా బాగా నానబెట్టి, ఉడకబెట్టుకుని తినాలని సూచిస్తున్నారు.
మష్రూమ్స్…
సాధారణంగా మష్రూమ్స్ ను ఎవరూ పెద్దగా పచ్చిగా తినరు. ఒకవేళ తిన్నా అడవి పుట్టగొడుగులను మాత్రం అస్సలు తినకండి అంటున్నారు.వీటిల్లో మస్సిమోల్ , మస్కారిన్ వంటి అనేక విషపదార్ధాలు ఉంటాయి. దానివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు, ప్రేగు సంబంధిత రుగ్మతలు, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పుట్టగొడుగులను తిన్న 6-24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒకవేళ పుట్టగొడుగుల్లో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటే.. లివర్, కిడ్నీ, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అడవి పుట్టగొడుగులను తినకుండా ఉండటమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
టమాటా.
టమాటా, బంగాళదుంప, వంకాయలలో.. సోలనిన్, చకోనైన్ అనే టాక్సిన్స్ ఉంటాయిట. ఇవి మొలకెత్తిన బంగాళదుంపలు, బంగాళదుంపలపై ఆకుపచ్చని మచ్చలు ఉంటే ఉంటాయి. ఇక పచ్చి టమాటాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలలో విషాన్ని తగ్గించడానికి, వాటిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. బంగాలదుంపలకు మొలకలు, ఆకుపచ్చగా ఉంటే.. తినకపోవడమే మంచిది. ముఖ్యంగా బంగాళదుంపలు పచ్చిగా తినకూడదు. పచ్చి బంగాళదుంపలో ‘గ్లైకోఅల్కలాయిడ్ టాక్సికేషన్’ కారణంగా మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఇంకా వెదురు, సెలరీ లాంటి మనకు అరుదుగా దొరికే వాటిల్లో కూడా ఇలాంటి విషపదార్ధాలు చాలానే ఉన్నాయిట. అందుకని ఏది తిన్నా బాగా ఉడకబెట్టి లేదా వేయించుకుని తినండి. పోషకాలు పోతాయని అన్నింటినీ పచ్చిగా తినాలని చూడకండని పదే పదే చెబుతున్నారు.