'ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారు': రాధాకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారు’: రాధాకృష్ణ

March 14, 2022

bfcb

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా మార్చి 11న విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక రాధేశ్యామ్ సినిమా థీమ్‌కు ఆకర్షితురాలై పెయింట్‌ను వేసింది. అంతేకాకుండా ఆ పెయింట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

దీంతో ఆ పోస్ట్‌ను చూసిన రాధేశ్యామ్ దర్శకుడు రాధకృష్ణ కూమార్ స్పందించారు. ఆమెను అభినందించారు. అంతేకాకుండా ఆమె వేసిన పెయింటింగ్ గురించి పలు మీడియా సమావేశాలలో ప్రస్తావించారు. తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ ఆమెను కలుసుకున్నాడు. ఆమెతో పాటు ఆమె గీసిన పెయింట్‌ ఫోటోతో ఓ సెల్పీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ”రాధేశ్యామ్ మీకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఈరోజు నాతో పాటు, దేశాన్ని కూడా ప్రేరేపించారు. నాలాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ మీద సినిమా చేస్తారు అని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అంటూ ట్వీట్ చేశారు.