Somu Veerraju criticized the YCP government
mictv telugu

అమిత్ షా ఎన్టీఆర్‌ను ఎందుకు కలిశారో చెప్పిన సోము వీర్రాజు

August 31, 2022

ఇటీవల తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అమిత్ షా – ఎన్టీఆర్ భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా ఏమైనా జరగవచ్చని, పార్టీ ముందుకెళ్లే క్రమంలో వ్యూహాత్మక కార్యక్రమాలు అనేకం జరుగుతాయని అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తగా వాటిని అమలు చేయడం తమ బాధ్యతని పేర్కొన్నారు.

అలాగే వినాయక చవితి సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ పండుగ రాజకీయ పార్టీలు పెట్టినది కాదని, ఆనాదిగా వస్తున్నదని వ్యాఖ్యానించారు. అనుమతుల పేరిట పెట్టిన ఆంక్షలు చూస్తే ఈ ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకున్నామా? లేక అమెరికా నుంచి దిగి వచ్చిందా? అనే అనుమానం కలుగుతుందన్నారు. చందా అడగాలన్నా పర్మిషన్ తీసుకోవాలనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. హిందువులు ఎవరూ కూడా పండుగలు చేయకూడదనే భావన ఈ ప్రభుత్వంలో కనిపిస్తోందని విమర్శించారు.