యువతిపై అర్జున అవార్డు గ్రహీత అత్యాచారం! - MicTv.in - Telugu News
mictv telugu

యువతిపై అర్జున అవార్డు గ్రహీత అత్యాచారం!

March 22, 2018

ఆడవాళ్లపై దాడులు, నేరాలు రకరకాలు.. ఒకడు కొడతాడు, ఒకడు అత్యాచారం చేస్తారు. మరొకడు ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుంటాడు. అనామకుల నుంచి సెలబ్రిటీల వరకు ఇదే తీరు. తాజాగా అర్జున అవార్డు గ్రహీత, 2012, 2016 ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్న సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచారం కేసు నమోదైంది. అతడు తనను పెళ్లాడతానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి ఆరోపించింది.

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఘోష్‌కు 2014లో సోషల్ మీడియా ద్వారా సదరు యువతి పరిచయమైంది. ఇద్దరూ కోల్‌కతాలోని ఘోష్ ఫ్లాట్‌లో ఓసారి, అతని స్వగ్రామమై సిలిగురిలో మరోసారి కలిశారు. తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఘోష్ ఒత్తిడితో అబార్షన్ చేయించుకుంది. ఓ గుడిలో ఇద్దరూ పెళ్లికూడా చేసుకున్నారు. ఈ ఆరోపణలను ఘోష్ కొట్టిపడేశాడు.  ఆమెతో తనకు పరిచయం ఉన్న మాట నిజమేనని, అయితే ఆమె డబ్బు కోసం ఈ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డాడు. ఆమెకు ఇంతవరకు లక్ష వరకు ఇచ్చాను. ఆమె బంధువులకు చికిత్స కోసం డబ్బు కట్టాను. అంతే తప్ప ఆమెపై అత్యాచారం చేయలేదు’ అని అన్నాడు.