Son and mother ate home Homemade Paratha With Mother At Airport
mictv telugu

ఎయిర్‌పోర్టులో ఇంటిసద్ది తిన్నాడు.. సూపర్ భయ్యా!

February 16, 2023

Son and mother ate home Homemade Paratha With Mother At Airport

ఒకప్పుడు విమాన ప్రయాణం ధనికులకు మాత్రమే పరిమితం. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా రయ్ రయ్ అంటూ విమానాలు ఎక్కేస్తున్నారు. టికెట్ ధరల సంగతి వదిలేస్తే ఎయిర్‌పోర్టుల్లోని హోటళ్లలో ధరలు నిజంగానే చుక్కలు చూపిస్తుంటాయి. బయట రూ. 30కి దొరికే టిఫిన్ అక్కడ నాలుగైదు వందలు. వాటర్ బాటిల్ వంద. ఏవేవో ట్యాక్సులు, నీట్ మెయింటెనన్స్ వంటి పేర్లు చెప్పి జేబులు కొల్లగొడుతుంటారు. ‘ఔట్ సైడ్ ఫుడ్ నాట్ అలోవ్డ్’ అంటారు. ఈ వ్యవహారంతో మండిపోయిన ఓ ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో దిమ్మతిరిగే పనిచేశాడు.

 

మాధుర్ సింగ్ యువకుడు ఇటీవల తన తల్లితో కలసి గోవాకు బయల్దేరాడు. ఇంట్లో చేసిన పరాటాలు, నిమ్మకాయ ఊరగాయ చక్కగా పార్సిల్ చేసుకుని బ్యాగులో పెట్టుకుని వెళ్లాడు. ఎయిర్‌పోర్టులో వెయింటింగ్ సమయంలో ఆకలి వేయంతో అక్కడే కుర్చీలో కూర్చుని తల్లీ కొడుకులు ఎంచక్కా తినేశారు. ఇంటి ఆహారాన్ని తినడం నామోషీ కాదని, ఎయిర్ పోర్టులో హోమ్లీ ఫుడ్‌ తినడాన్ని అలవాటుగా మార్చుకోవాలని మాధుర్ ట్వీట్ చేశాడు. తింటున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ‘‘400 పెట్టి దోసె, వంద పెట్టి వాటర్ బాటిల్ కొనడం దండగ.. కొంతమంది ప్రయాణికులు మమ్మల్ని వింతగా చూశారు, కానీ మేం పట్టించుకోలేదు. మనకిష్టమైనవి మనం తినాలి. మనికిష్టం వచ్చినట్లు జీవించాలి’’ అని రాశాడు. మాధుర్ సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. వందలు వేలు తగలేసి పిజ్జా గిజ్జా వంటివి తినకుండా ఎంచక్కా మన ఇండియన్ ఫుడ్ తింటే ఆరోగ్యాననికి ఆగోగ్యం, పొదుపు పొదుపు అని అంటున్నారు.