తల్లి, కొడుకులు ఒకేసారి పదోతరగతి పాసయ్యారు - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి, కొడుకులు ఒకేసారి పదోతరగతి పాసయ్యారు

August 2, 2020

Son And Mother SSC Pass In Same Time.

కన్న కొడుకే ఆమెకు గురువు అయ్యాడు. చదువు మధ్యలోనే ఆపేసిన తల్లికి పాఠాలు చెప్పడమే కాకుండా తనతో పాటు ఫస్ట్‌ క్లాస్ మార్కులతో పదోతరగతి పాస్ అయ్యేలా చేశాడు. కొడుకుతో పాటే తల్లి కూడా ఒకేసారి పాస్ కావడంతో ఆ కుటుంబం సంబరంలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఈ అరుదైన ఘటన జరిగింది.

బేబీ గౌరవ్‌ (36) అనే మహిళకు ప్రదీప్ గౌరవ్‌ అనే వ్యక్తితో చాలా కాలం క్రితం పెళ్లి జరిగింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో ఆమె పదో తరగతి కూడా చదవలేకపోయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో వారి ఆలనా పాలన చూసుకోవడానికే సరిపోయింది. కొడుకు పదోతరగతికి చేరడంతో తనకు కూడా చదువు కోవాలని అనిపించింది. భర్త, కుమారుడి సహకారంతో తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టింది. కొడుకుతో ఇంగ్లీష్, గణితం పాఠాలు చెప్పించుకొని ఉత్తీర్ణత సాధించింది.  బేబీ 64.40 శాతం మార్కులు సాధించగా,కొడుకు 73.20 శాతం మార్కులు సాధించడం విశేషం. ఓ వైపు కుటుంబ పోషణ కోసం బట్టల తయారీ కంపెనీలో పని చేస్తూనే పదో తరగతి సాధించిన ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు.