మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వావివరుసలు, వయుస్సుతో సంబంధం లేకుండా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద, తప్పు, ఒప్పు అనే మాటలను పక్కనపెట్టి అవకాశం వస్తే చెలరేగిపోతున్నాయి కొన్ని జంటలు. ఇదేంటని ప్రశ్నిస్తే హంతకులుగా మారిపోతున్నారు. ప్రశ్నించిన వారు ఎంతటి వారైనా వదలడం లేదు. అయినవారిపైనే దాడులకు తెగబడుతున్నారు. అవసరమై హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా ఓ ఆంటీ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు తండ్రిని చావబాదాడు. ప్రియురాలికి వీడియో కాల్ చేసి మరి దాడి చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీ బాబు అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి భరత్ అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతదు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భరత్‌కు 39 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఆమెతో ఫోన్ మాట్లాడటం, కలవడం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి..భరత్‌ను మందలించాడు. కానీ తండ్రి మాటలు అతడు వినిపించుకోలేదు. ఆమె ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో భరత్‌ను మందలించి పంపేశారు పోలీసులు. ఇంటికి వచ్చాక తరువాత భరత్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై కర్రతో దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ దాడిలో అతడికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.