బారాత్‌లో పెళ్లి కొడుకు డ్యాన్సులు..వేరొకరిని పెళ్లాడిన వధువు - MicTv.in - Telugu News
mictv telugu

బారాత్‌లో పెళ్లి కొడుకు డ్యాన్సులు..వేరొకరిని పెళ్లాడిన వధువు

May 18, 2022

 

రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఓ పెళ్లి కూతురు వరుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సంఘటన జరిగింది. పెళ్లికొడుకు, అతని బంధువులు చేసిన పనికి ఆగ్రహంతో రగిలిపోయిన పెళ్లి కూతురు మరో వ్యక్తిచేత తాళి కట్టించుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..”వరుడు సునీల్‌ వారి బంధుమిత్రులతో కలిసి రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ, స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమయం దాటిపోయిన రాలేదు. దాంతో సహనంలో కోల్పోయిన పెళ్లికూతురు అతనిని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె పెళ్లి చేశారు.”

అనంతరం వధువు ఊరుకి వచ్చిన సునీల్‌ వారి బంధుమిత్రులు అప్పటికే వధువుకు మరోక వ్యక్తితో పెళ్లి కావడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేమిటని ప్రశ్నించగా.. సునీల్ కుటుంబ సభ్యులకు, వధువు తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకొని, తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేసే వ్యక్తిని పెళ్లి చేసుకోవటం తనకు ఇష్టం లేదని వధువు చెప్పడంతో గొడవ సర్థిమనిగింది. ఈ ఘటనను వీక్షించిన స్థానికులు వరుడికి సరైన బుద్ది చెప్పావంటూ వధువును, ఆమె తల్లిదండ్రులను అభినందించారు.