రైతుబీమా సొమ్ము కోసం తల్లినే కడతేర్చి.. సంగారెడ్డిలో..  - MicTv.in - Telugu News
mictv telugu

రైతుబీమా సొమ్ము కోసం తల్లినే కడతేర్చి.. సంగారెడ్డిలో.. 

October 13, 2020

Son incident mother for farmer's insurance money

తొమ్మిది నెలలు మోసి, లాలించి, పాలించి, బిడ్డ మంచీ చెడ్డా చూసుకోవడంలో ఆ తల్లి తన జీవితాన్ని ధారపోసింది. కానీ, ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఏం చేశాడు? రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లిని కడతేర్చి, తల్లి రుణం అలా తీర్చుకున్నాడు ఆ కసాయి కొడుకు. వాడు పెద్దయ్యాక తన పాలిట యుముడు అవుతాడని ఆమెకు ముందే తెలిసుంటే సరిపోయేదేమో. కానీ, ఏ తల్లీ తన బిడ్డ చెడ్డవాడని తెలిసి తన చేతులతో చంపుకోదు. కానీ కొందరు కొడుకులు ఎందుకిలా?   

సంగారెడ్డి జిల్లాలోని కంగరి మండలం బాబులాగమ శివారులో ఈ ఘటన ఏడాది క్రితం చోటు చేసుకుంది. బాబులాగమ శివారులో తులసీ బాయి గత ఏడాది హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి హత్య మిస్టరీని చేధించారు. మృతురాలి కొడుకు పవార్ శంకర్, మనుమడు పుండలిక్‌తో కలిసి హత్య చేసినట్లు తమ విచారణలో తేల్చారు. కేవలం రైతుబీమా డబ్బుల కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. రూ.5 లక్షల రైతుబీమా డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చిన ఈ ఘటన ఏడాది తరువాత వెలుగులోకి రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.