తండ్రి శవం సాక్షిగా తనయుడి పెళ్లి! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి శవం సాక్షిగా తనయుడి పెళ్లి!

August 11, 2019

Son married.

ఓ పక్క తండ్రి శవం.. మరో పక్క తనయుడి వివాహం. ఇదేంటి తండ్రి శాపం పక్కన పెట్టుకొని కొడుకు పెళ్లిచేసుకోవడం ఏంటి అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్టంలోని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని సింగనూరుకు చెందిన అలెగ్జాండర్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. అదే స్కూల్‌లో పనిచేస్తున్న జగదీశ్వరితో ప్రేమలో పడ్డాడు. 

వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. సెప్టెంబర్ 2న పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారు. అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అలెగ్జాండర్ తండ్రి దైవమణి శక్రవారం కనుమూశారు. దీంతో అలెగ్జాండర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, తండ్రిపై అపార ప్రేమ ఉన్న అలెగ్జాండర్ తండ్రి మృతదేహం వద్దే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని జగదీశ్వరి కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు కూడా అందుకు అంగీకరించడంతో జగదీశ్వరి మెడలో తాళి కట్టాడు.