గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీ మారనున్న అహ్మద్ పటేల్ కుమారుడు - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీ మారనున్న అహ్మద్ పటేల్ కుమారుడు

April 5, 2022

bfbfb

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గుజరాత్ కాంగ్రెస్‌ భారీ కుదుపుకు గురవుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ సొంత పార్టీపై అసమ్మతి ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అధిష్టానం నుంచి తనకు సరైన ప్రోత్సాహం అందట్లేదు. నా దారి నేను చూసుకుంటా’నని బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ను వీడి ఆప్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఇటీవల కేజ్రీవాల్‌ను కలిసి చర్చించినట్టు తెలుస్తోంది. వారం కిందే ఫైసల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూట్ మ్యాపును ప్రకటించారు. పార్టీతో సంబంధం లేకుండా 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. ఇందుకు తన బృందం ఇప్పటికే తగిన ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు. కాగా, అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా వ్యూహానికి ఎదురొడ్డి ఎగువ సభకు గెలుపొందారు. ట్రబుల్ షూటర్‌గా పేరొందారు. అలాంటిది ఆయన కుమారుడే పార్టీని వీడుతున్నారంటే గుజరాత్‌పై కాంగ్రెస్ ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.