సత్యనాదెళ్ల కుమారుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సత్యనాదెళ్ల కుమారుడు మృతి

March 1, 2022

01

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) మృతి చెందారు. జైన్‌ నాదెళ్ల పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు.

సత్య నాదెళ్ల, అనుపమ దంపతులకు జైన్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైన్ పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడ్డాడు. జైన్ మరణించినట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది. నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని, వారికి ఏకాంతాన్ని ఇవ్వాలని కోరింది.