ఆరెస్సెస్‌ చీఫ్‌పై సోనమ్ కపూర్ ఫైర్‌! - MicTv.in - Telugu News
mictv telugu

ఆరెస్సెస్‌ చీఫ్‌పై సోనమ్ కపూర్ ఫైర్‌!

February 17, 2020

Sonam Kapoor.

ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. చదువుకునోళ్ళ కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు.

”ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాల కోసం విడాకులు తీసుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్లు.. ధనవంతులే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు.’ అని మోహన్‌ భగవత్‌ అన్నారు. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై సోనం కపూర్‌ ట్వీట్ చేస్తూ..”ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు” అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం సోనం కపూర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.