ఆ క్యాబ్ డ్రైవర్ భయపెట్టాడు..బాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ క్యాబ్ డ్రైవర్ భయపెట్టాడు..బాలీవుడ్ నటి

January 16, 2020

n vb

క్యాబ్‌ ఎక్కుతున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తనతో రోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదని.. తాజాగా బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌‌కు జరిగిన అనుభవం చెబుతోంది. ‘లండన్‌లో ఉబెర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి… అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో ప్రయాణం చేయడమే అత్యంత శ్రేయస్కరం. నేనైతే వణికిపోయాను’ అంటూ లండన్‌ ఉబెర్ క్యాబ్‌ ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె ట్వీట్ చేశారు. 

డ్రైవర్‌ తనపై విపరీతంగా అరిచాడని… దాంతో తాను క్యాబ్‌ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్‌లలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదంటూ కొందరు నెటిజన్లు తమ అనుభవాలను సోనమ్‌తో పంచుకుంటున్నారు. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. ఉబర్‌ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించింది. ‘వాయిస్‌ ఆడియో రికార్డింగ్‌’ అనే ఫీచర్‌ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది.