Song with 1000 people..Fight with 1200 people: Ramcharan
mictv telugu

1000 మందితో పాట..1200 మందితో ఫైట్: రాంచరణ్

July 6, 2022

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ శంకర్ రాం చరణ్, కియారా అద్వానీతో ఓ పాటను చిత్రకరించడానికి 1000 మంది డ్యాన్సర్లను ఎంపిక చేశారట. ప్రస్తుతం పంజాబ్‌ లొకేషన్స్‌లో ఆ పాటను వెయ్యి మంది డ్యాన్సర్లతో షూట్‌ చేస్తున్నాడట. ఆ తర్వాత ఈ పాట కొనసాగింపు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో జరుగుతుందట. ఈ పాటకు గణేష్‌ ఆచార్య కొరియోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారట. అయితే, ఈ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే మరో భారీ ఫైట్ సీన్‌కు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నారని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

ఇక, ఆ ఫైట్ విషయానికొస్తే.. ఆ యాక్షన్‌ సీన్‌లో దాదాపు 1200మంది ఫైటర్స్‌ పాల్గొంటారట. దాదాపు 20 రోజులపాటు ఈ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ జరుగుతుందని, ఈ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్‌ దాదాపు 75 శాతం పూర్తవుతుందట. ఆ తర్వాత మిగతా షూట్‌ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది. దాంతతో 95 శాతం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే, ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.