ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. టెన్షన్ వద్దన్న డాక్టర్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. టెన్షన్ వద్దన్న డాక్టర్లు

July 31, 2020

Sonia Gandhi Admitted in Hospital

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆమె చికిత్స కోసం వెళ్లి అడ్మిట్ అయ్యారు. ఉన్నట్టుండి  ఆమె అనారోగ్యబారిన పడ్డారనే విషయం తెలిసి వెంటనే కాంగ్రెస్ శ్రేణులు కలవరపడ్డారు. అయితే సాధారణ పరీక్షల కోసమే ఆమె వచ్చారని డాక్టర్లు వెల్లడించారు.  

కొంత కాలం క్రితం కూడా ఆమె అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కుదుటపడటంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల రాజస్థాన్ సంక్షోభంపై కూడా ఫోకస్ పెట్టి పలు సూచనలు కూడా చేశారు ఈ నేపథ్యంలో మరోసారి అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. కొన్ని వైద్యపరీక్షల కోసమే సోనియా వచ్చారనిడాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.