sonia-gandhi-comments-political-retirement-raipur-plenary-session
mictv telugu

రాజకీయాలకు సోనియా గుడ్ బై చెప్పేస్తున్నారా?

February 25, 2023

sonia-gandhi-comments-political-retirement-raipur-plenary-session

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్ పూర్తికానుందని సోనియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్ని రోజులుా ఆమె అన్నింటికీ దూరంగా ఉంటున్నారు. కొంత అనారోగ్యం కారణం అయితే మరికొంత అసలు కాంగ్రెస్సే డల్ గా ఉండటం. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ప్రసంగంతో ఇక మీదట పూర్తిగా రాజకీయాలకు దూరం కాబోతున్నారనే సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తున్నాయి.

ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజులు పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఈరోజు ఆమె ప్రసంగించారు. దీనిలో భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపని సోనియా వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడం చాలా సంతోషం కలిగిస్తోందని కూడా అన్నారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహన్, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. యాత్రను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇటువంటి యాత్రతో తన రాజకీయ జీవితానికి ముగింపు పలకడం ఆనందాన్నిచ్చిందని సోనియాగాంధీ చెప్పారు.

సోనియాగాంధీ బీజెపీ మీద కూడా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం భారతదేశానికే ఇప్పుడు సవాలు లాంటి సమయం నడుస్తోందని అన్నారు. , బీజెపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. కొద్దిమందికి మాత్రమే బీజెపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ మతాలు, కులాల తేడా లేకుండా అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజెపీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు సోనియాగాంధీ. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ప్రగతి పధంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.