కోలుకున్న సోనియా గాంధీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

కోలుకున్న సోనియా గాంధీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

August 2, 2020

Sonia Gandhi Discharged From Hospital .

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోలుకున్నారు. ఇటీవల పొత్తి కడుపులో నొప్పి కారణంగా ఢిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో చేరారు. వైద్యం తీసుకున్న తర్వాత ఆమె ఆదివారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. 

జూలై 30న హఠాత్తుగా ఆమె అనారోగ్యంతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే వైద్యులు పలు పరీక్షలు చేసి చికిత్స అందించారు. సాధారణ పరీక్షల కోసం మాత్రమే వచ్చారని చెప్పారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. సోనియా గాంధీ ఆరోగ్యంగా ఇంటికి చేరడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమెకు పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గతంలోనూ వైద్యం కోసం విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు.