ఈడీ విచారణ వేళ సోనియా గాంధీకి కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఈడీ విచారణ వేళ సోనియా గాంధీకి కరోనా

June 2, 2022

కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. తేలికపాటి జ్వరం, స్వల్పలక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారని, వైద్యం అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా సోనియా అనేక మంది నేతలు, కార్యకర్తల్ని కలుస్తున్నారని.. వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు వివరించారు. వైద్యుల సూచనమేరకు ప్రస్తుతం ఆమె స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉన్నారని వెల్లడించారు. అయితే తాము ముందుగా చెప్పినట్టు.. ఈనెల 8న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఎదుట ఆమె హాజరవుతారని చెప్పారు.