కేటీఆర్‌ను అన్నారు కదా.. సోనియా, రాహుల్ చేసిందేంటో మరి.. - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌ను అన్నారు కదా.. సోనియా, రాహుల్ చేసిందేంటో మరి..

October 2, 2018

స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర వార్ధాలోని మహాత్మా గాంధీ సేవాగ్రాం ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారం శ్రద్ధాంజలి సభ నిర్వహించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ అనంతరం కాంగ్రెస్ నేతలు అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ ప్లేట్లను తాము కడిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

tt

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగారంటూ.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు సోనియా, రాహుల్, మన్మోహన్ కూడా వారు తిన్న ప్లేట్లను వారే కడిగారు. అయితే ఎవరి పనులు వారు చేసుకోవడం తప్పుకాదని, సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వారు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా నెటిజన్లు మాత్రం కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకరిని విమర్శించే టప్పుడు వారికి ఒక రోజు వస్తుందని ఆలోచించాలని సూచిస్తున్నారు.