తండ్రి ఎమ్మెల్యే.. కుమారులు పంక్చర్ షాప్.. కార్పెంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి ఎమ్మెల్యే.. కుమారులు పంక్చర్ షాప్.. కార్పెంటర్

March 18, 2022

 h cfhbfhb

తండ్రి ఎమ్మెల్యే అయితే వారసులు అందుకు తగిన విధంగా రాజకీయాల్లో ఉంటారు లేదా పదవీ అండతో ఏదైనా పెద్ద వ్యాపారం చేసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా సాధారణ వృత్తిని ఎవరూ ఎంచుకోరు. కానీ, ఈ అభిప్రాయం తప్పని ఓ ఎమ్మెల్యే వారసులు నిరూపించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ తరపున గంగోలీ హాట్ నియోజకవర్గం నుంచి ఫకీర్ రామ్ టమ్టా విజయం సాధించారు. తండ్రి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనుండగా, పెద్ద కుమారుడు జగదీశ్ టమ్టా ఓ పంక్చర్ షాపును నడిపిస్తున్నాడు. చిన్న కుమారుడు బీరేంద్ర రామ్ టమ్టా కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. స్థానిక మీడియా వారిని పలకరించగా.. తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందడం సంతోషంగా ఉందనీ, తమకు ఎప్పటినుంచో ఉపాధి కల్పిస్తున్న పనలను వదలమనీ, ఇకపైనా అలాగే ఉంటామని స్పష్టం చేశారు. తండ్రి గతంలో ఎన్నో అభివ‌ృద్ధి పనులు చేశాడనీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇంకా బాగా పని చేస్తాడనీ చిన్న కుమారుడు తెలిపాడు. తండ్రికి కలప వ్యాపారం ఎప్పటినుంచో ఉందనీ, తానూ అదే వృత్తిలో కొనసాగాలనుకున్నట్టు బీరేంద్ర తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.