తండ్రితో డేటింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రితో డేటింగ్.. ఎందుకో తెలిస్తే షాక్

March 23, 2022

006

ఆన్‌లైన్‌లో డేటింగ్ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలియజేసే వింత సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. హాలీవుడ్ నటుడు కం దర్శకుడు జేమ్స్ కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో బెక్కా అనే అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఇద్దరి అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య ఆన్‌లైన్ ప్రేమ చిగురించింది. అనంతరం చాటింగు, డేటింగు అంటూ కొంతకాలం గడిచింది. ఈ క్రమంలో తమకు సంబంధించిన చాలా విషయాలు సరిపోలడంతో జేమ్స్‌కు అనుమానం వచ్చింది. ఎలాగైనా అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకొని అమ్మాయి బెక్కా పూర్తి వివరాలు తీసుకున్నాడు. దాంతో ఇంతకాలం తాను డేటింగ్ చేస్తున్నది తన తండ్రితోనే అని తెలుసుకొని షాకయ్యాడు. కానీ, ఎందుకలా చేయాల్సి వచ్చిందోనని తండ్రి చెప్పిన కారణం విని స్థిమితపడ్డాడు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తన కుమారుడి ప్రవర్తన ఎలా ఉంది? ఎవరి చేతిలోనైనా మోసపోతున్నాడా? అని తెలుసుకోవడానికే ఇలా చేశానని తండ్రి సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని జేమ్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ తండ్రిని అభినందిస్తున్నారు. కుమారుడి పట్ల ఇంత కేర్ తీసుకున్నందుకు ఆయన అభినందనీయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.