సోనూసూద్ సాయం ఫేక్ అంట.. నటుడి ఘాటు కౌంటర్  - MicTv.in - Telugu News
mictv telugu

సోనూసూద్ సాయం ఫేక్ అంట.. నటుడి ఘాటు కౌంటర్ 

October 26, 2020

Sonu Sood Has A Befitting Reply For People Accusing Him Of 'Fake Philanthropy', 'PR Stunts'

కొందరుంటారూ.. వాళ్లు మంచి చేయరు, మంచి చేస్తున్నవారిని తోక పట్టి వెనక్కు లాగే ప్రయత్నం చేస్తుంటారు. ‘కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను చెడగొట్టిందట’ అన్న చందంగా ప్రవర్తిస్తుంటారు. మంచిపనిలో కూడా భూతద్దం పెట్టి వెతికి మరీ దానిమీద దుష్ప్రచారం చేస్తుంటారు. అలాంటివారికి అప్పుడు ధీటైన సమాధానం ఇవ్వకపోతే వారు ఇంకా రెచ్చిపోతారు. దీంతో మంచి కాస్తా భ్రష్ఠుపట్టిపోతుంది. అలాంటి వక్రబుద్ధి కలిగిన  నెటిజన్లకు నటుడు సోనూసూద్ గట్టిగా బుద్ధి చెప్పాడు. సోనూసూద్ చేస్తున్న సాయం ఫేక్ అంటూ వారు సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. వారికి సోనూ ఘాటు కౌంటర్ ఇచ్చాడు. 

ఇంతకీ ఆ నెటిజన్ ఏమన్నాడంటే.. ‘ఇద్దరు ముగ్గురు ఫాలోవర్లు ఉన్న ఓ కొత్త ట్విటర్ ఖాతాదారుడు తన వైద్యానికి సహాయం చేయలంటూ ఒకే ఒక ట్వీట్ చేశాడు. కనీసం సోనూను ట్యాగ్ చేయలేదు. లొకేషన్ చెప్పలేదు. కాంటాక్ట్ డిటైల్స్, ఈ మెయిల్ అడ్రస్ ఇవ్వలేదు. అయినా ఆ ట్వీట్‌కు సోనూ రిప్లై ఇచ్చాడు. ఇదెలా సాధ్యమో తెలియడం లేదు. అలాగే సహాయం కోరుతూ గతంలో చాలా ట్విటర్ హాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు డిలీట్ అయిపోయాయి’ అని సదరు నెటిజన్ వెటకారంగా కామెంట్ చేశాడు. అతని కామెంట్‌కి సోనూ స్పందించాడు. ‘అదే గొప్ప విషయం బ్రదర్. ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను గుర్తిస్తా. వారు నన్ను ఆశ్రయిస్తారు. అది చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. అలాంటివి నీకు అర్థం కావు. రేపు పేషెంట్ ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే వెళ్లి చేయి. అతడికి కొన్ని పండ్లు పంపించు. ఎంతో మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ప్రేమకు ఆ ఇద్దరు ఫాలోవర్లు ఉన్న వ్యక్తి సంతోషిస్తాడు’ అని సోనూ నొచ్చుకోకుండా రిప్లై ఇచ్చారు. తన రిప్లైతో పాటు ఆ రోగి వివరాలను కూడా పంచుకున్నాడు. సోనూ పోస్టు చూసి చాలామంది నెటిజన్లు సదరు వ్యక్తిని తిడుతున్నారు.