సోనూ సూద్ మరో మంచిపని..మృతుల కుటుంబాలకు.. - MicTv.in - Telugu News
mictv telugu

సోనూ సూద్ మరో మంచిపని..మృతుల కుటుంబాలకు..

July 13, 2020

soonju

లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను నటుడు సోనూ సూద్ సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు చేసిన సంగతి తెల్సిందే. దీంతో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ ప్రజల దృష్టిలో ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. ఆయన మానవత్వానికి యావత్ భారతదేశం ఫిదా అయింది. ఆయను పొగుడుతూ ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తాజాగా సోనూ సూద్ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సొంతూళ్లకు వెళ్తూ మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన వలసదారుల చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోను సూద్ ప్రకటించారు.