సర్వేలో సోనూ సూద్ నంబర్ వన్..అగ్ర హీరోలు వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

సర్వేలో సోనూ సూద్ నంబర్ వన్..అగ్ర హీరోలు వెనక్కి

July 5, 2020

 bcfbcv

లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో చిక్కుకుని ఉపాధికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను నటుడు సోనూ సూద్ సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు చేసిన సంగతి తెల్సిందే. దీంతో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ ప్రజల దృష్టిలో ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. ఆయన మానవత్వానికి యావత్ భారతదేశం ఫిదా అయింది. ఆయను పొగుడుతూ ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరైతే సోనూ సూద్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.

తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్(ఐఐహెచ్‌బీ) నిర్వహించిన ఓ సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలకు సేవ‌లు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఐఐహెచ్‌బీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సోనూ సూద్ మిగతా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లను వెనక్కి నెట్టి  అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సర్వేలో అక్షయ్ కుమార్ రెండవ స్థానం సాధించగా, అమితాబ్ బచ్చన్ మూడవ స్థానంలో నిలిచారు.