సింధూతో  సోనూసూద్ ఫైట్!  - MicTv.in - Telugu News
mictv telugu

సింధూతో  సోనూసూద్ ఫైట్! 

September 5, 2017

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఇప్పటికే రెండు వెండి పతకాలను సాధించి చరిత్ర సృష్టించింది.  పి.వి సింధు. వెండితెరపై తన నటనతో ఆకట్టుకునే సోనూసూద్ తాజాగా ఆమెతో సరదాగా బ్యాడ్మింటన్ ఆడాడు. ఇదంతా త్వరలో తెరకెక్కబోతున్న సింధు బయోపిక్ కోసమే.

‘మన ప్రత్యర్థి  ప్రపంచంలోనే బెస్ట్ అయినప్పుడు కూడా మనకు  ఓటమి భయం అక్కర్లేదు. మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు సింధు’ అని రాసి సింధూతో బ్యాట్మింటన్ ఆడిన వీడియోను  సోనూసూద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే సింధూ బయోపిక్ లో సింధూ పాత్ర ఎవరు పోషిస్తారనే వివరాలు త్వరలో వెల్లడిస్తారట.