పేదచెల్లికి సోనూ సూద్ రాఖీ కానుక.. ఇల్లు కట్టిస్తానమ్మా..  - MicTv.in - Telugu News
mictv telugu

పేదచెల్లికి సోనూ సూద్ రాఖీ కానుక.. ఇల్లు కట్టిస్తానమ్మా.. 

August 3, 2020

Sonu Sood Promises To Build New House For Woman Affected By Assam Floods

సోనూసూద్ గొప్ప మనసు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలబడ్డవాడే అసలుసిసలైన మనిషి అంటారు. ఆ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు సోనూసూద్. సినిమాల్లో నీతి, న్యాయం, ధర్మం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కాదు.. నిజ జీవితంలో కూడా అవి ఉండాలని నిరూపిస్తున్నాడు సోనూ. మొన్న ఏపీలో ఓ పేద రైతుకు పొలం దున్నుకోవడానికి ట్రాక్టర్ కొనిచ్చిన విషయం తెలిసిందే. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా సోనూసూద్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఓ పేదింటి చెల్లికి రాఖీ కానుక ఇచ్చాడు. సిమెంట్ సంచులతో ఉన్న గుడిసె స్థానంలో ఆమెకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. 

అస్సాంలోని జల్‌పాయిగురి ఆసమ్‌లో భర్తను పోగొట్టుకున్న ఓ ఒంటరి మహిళ చిన్న గుడిసెలో తన బిడ్డతో నివసిస్తోంది. నిత్యం కూలీపనులు చేసుకుని జీవిస్తోంది. సిమెంట్ సంచులతో చుట్టినట్టు ఉంటుంది ఆ గుడిసె. గట్టిగా వర్షం, గాలి వస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోనూసూద్‌కు ట్వీట్ చేశాడు. ఈ పేదింటి మహిళను ఆదుకోవాలి సోనూ భయ్యా అని అతను అభ్యర్థించాడు. పేదల ఆఖరి ఆశాజ్యోతివి నువ్వే అని పేర్కొన్నాడు. దీనిపై సోనూసూద్ వెంటనే స్పందించాడు. ఆ చెల్లికి ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చాడు.