మిమ్మల్ని ఇంటికి పంపేదాక ఆగను.. సోను మరో రెండు విమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

మిమ్మల్ని ఇంటికి పంపేదాక ఆగను.. సోను మరో రెండు విమానాలు

August 12, 2020

సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ లాక్ డౌన్ లో రియల్ హీరో అవతారమెత్తాడు. లాక్ డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో, దేశాల్లో చిక్కుకున్న వేలది మందిని సొంత డబ్బులతో స్వస్థలాలకు చేర్చుతున్నాడు. కేరళలో చిక్కుకున్న ఒడిశా కార్మికులను ప్రత్యేక విమానంలో స్వరాష్ట్రానికి చేర్చిన సంగతి తెల్సిందే. అలాగే ఫిలిప్పీన్స్‌ లో చిక్కుకున్న వాళ్ళను స్వదేశానికి తీసుకుని రావడానికి ప్రత్యేక విమానాన్ని పంపించాడు. 

 

 

తాజాగా కరోనా కారణంగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మేరకు సోనూ సూద్ ట్వీట్ చేస్తూ..’భారత్‌-పిలిప్పీన్స్‌.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నాడు. అలాగే కజకస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోను తెలిపాడు.

 

 

Sonu Sood to bring back Indians from Philippines