Sonu Sood wants to help a girl who goes to school with one leg
mictv telugu

వీడియో : ఒంటికాలితో కుంటుతూ స్కూలుకు బాలిక.. చలించిపోయిన హెల్పింగ్ స్టార్

May 25, 2022

Sonu Sood wants to help a girl who goes to school with one leg

బీహార్‌కు చెందిన సీమ అనే బాలిక రెండు కాళ్లు లేకున్నా ఒక కాలితోనే కుంటుతూ స్కూలుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంగవైకల్యం ఉన్నా చదువుకోవాలన్న బాలిక తపన అందరినీ కదిలించింది. తల్లిదండ్రులు పేదవారు అయినా చదువుపై మమకారంతో ఆ బాలిక కిలోమీటరు దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లి చదువుకుంటోంది.

రెండేళ్ల క్రితం ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగేస్తుంది. ఈ వీడియోను చూసి హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా కరిగిపోయాడు. వెంటనే బాలిక సీమకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆమెకు కృత్రిమ కాలు అమర్చడానికి సహాయపడతానని, ఇక నుంచి సీమ రెండు కాళ్లతో స్కూలుకు వెళ్తుందని భరోసా ఇచ్చాడు. అలాగే రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి కూడా బాలికకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కాగా, బాలికకు సహాయమందడం కేవలం సోషల్ మీడియా వల్లే సాధ్యమైంది.