అలా చేయడం భార్యలకు జన్మహక్కు : సోనూసూద్ - MicTv.in - Telugu News
mictv telugu

అలా చేయడం భార్యలకు జన్మహక్కు : సోనూసూద్

April 13, 2022

sonu

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎందరో అభాగ్యులను ఆదుకొని తన దాత‌ృత్వాన్ని చాటుకున్న నటుడు సోనూసూద్. దేశంలో ఏ మూల నుంచి ఎవ్వరు ఏమి అడిగినా కాదనకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు, వసతులను ఏర్పాటు చేసి ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఈ క్రమంలో కొందరు సరదాగా, ఫన్నీగా అడిగినవి కూడా ఉన్నాయి. వాటికి ఆయన కూడా అంతే సరదాగా సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాజాగా అడిగిన సహాయం చర్చల్లోకి వచ్చింది. ధర్మేంద్ర కూమార్ అనే నెటిజన్ ‘సోనూసూద్ గారూ.. మీరు అందరికీ సహాయం చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దీనికేమైనా చికిత్స ఉంటే దయచేసి నా భార్యకు ఇప్పించండి. ఓ భార్యా బాధితుడిగా మీ సహాయం కోసం అడుగుతున్నాను’ అని ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశాడు. దీనికి సోనూసూద్ ‘అది ప్రతీ భార్యకున్న జన్మహక్కు. నా మాట విని ఆ రక్తంతో ఓ బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి’ అని అంతే ఫన్నీగా బదులిచ్చారు. దీనిపై మిగతా నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు రాస్తున్నారు. కాగా, ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన సోనూసూద్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో విలన్‌గా నటించారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదలవుతోంది.