తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రొమేనియా మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన విషయంలో సోనూసూద్ స్పందించారు. అందరూ పబ్బుల వల్లే అత్యాచారం జరిగిందని చెప్తున్నారనీ, కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా మైనర్లు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఇది చాలా పెద్ద ఘటన. చేసింది మైనర్లా, మేజర్లా అని చూడకూడదు.
ఎలాంటి నేరం చేశారన్నదే పాయింటు. అలాగే పబ్బు కల్చర్ రేపులకు కారణం కాదు. అలా అయితే గ్రామీణ భారతంలో ఒక్క రేప్ ఘటన జరుగకూడదు. ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. అలాగే పొట్టి దుస్తులు ధరించడం ఒక కారణం అంటున్నారు. అది కూడా కాదు. మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలే వస్తాయి. ముందు వాటిని నియంత్రించాలి’ అని వ్యాఖ్యానించారు.