బాలీవుడ్ నటుడు సోనూసుద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సోదరి మాళవిక పంజాబ్ ఎన్నికల ఫలితాలలో ఘోర పరాజయం పొందారు. ఉత్తర భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఓడించి మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఆప్ అభ్యర్థుల చేతుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఘోరంగా పరాజయం పొందుతున్నారు. ఆప్ దెబ్బకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఓటమిపాలవుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పొందారు. అమన్ దీప్‌కు 58,813 ఓట్లు రాగా, మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి.