సోనీ ‘వాక్‌మాన్‌’ మళ్ళీ వచ్చింది! - MicTv.in - Telugu News
mictv telugu

సోనీ ‘వాక్‌మాన్‌’ మళ్ళీ వచ్చింది!

January 24, 2020

Sony brings.

అప్పట్లో సంగీత ప్రియులను అలరించిన వాక్‌మాన్‌లను సోనీ సంస్థ మళ్లీ తీసుకొచ్చింది. ఈసారి టచ్‌స్క్రీన్‌ సదుపాయంతో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే వాక్‌మాన్‌ ఎన్‌డబ్ల్యూ–ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధరను రూ. 23,990గా నిర్ణయించింది. ఇందులో 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్‌మాన్‌లు అందుబాటులోకి వస్తాయి. ఈ వాక్ మెన్ కేవలం 105గ్రాముల బరువు మాత్రమే ఉండనుంది. 

 

సోనీ వాక్‌మాన్‌ ఎన్‌డబ్ల్యూ–ఎ105 ఫీచర్లు

 

* 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్,

* 4జీబీ ర్యామ్,

* ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్,  

* ఫాస్ట్ చార్జ్‌.