త్వరలోనే బీజేపీ, జనసేన మధ్య తెగదింపులు: సీపీఐ రామకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే బీజేపీ, జనసేన మధ్య తెగదింపులు: సీపీఐ రామకృష్ణ

March 18, 2022

yjfytj

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీల మధ్య త్వరలోనే తెగదెంపులు జరుగుతాయని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఇప్పటికే బీజేపీ రోడ్ మ్యాప్‌లో జగన్ నడుస్తున్నారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుంటారు. బీజేపీ, జనసేనల మధ్య త్వరలోనే తెగదెంపులు జరుగుతాయి. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పవన్ కలిసి వస్తారు” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో నాటుసారా తాగి 25 మంది చనిపోతే సీఎం జగన్ వాటిని సహజ మరణాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్ అమ్ముకునే ఒకే ఒక్క వ్యక్తి జగన్ అని, ఆయన తన బ్రాండ్లతో ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు లాగారని మండిపడ్డారు.