Soon purchase of cow urine from farmers: Chhattisgarh Government
mictv telugu

త్వరలో రైతుల నుంచి గోమూత్రం కొనుగోలు : చత్తీస్‌గఢ్ ప్రభుత్వం

July 15, 2022

Soon purchase of cow urine from farmers: Chhattisgarh Government

రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి ఇప్పటికే పేడను సేకరిస్తున్న చత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆవుపేడలాగే గోవు మూత్రాన్ని కూడా సేకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ గోధన్ సమితుల ద్వారా సేకరించి లీటరు మూత్రానికి రూ. 4 చొప్పున చెల్లించనున్నట్టు తెలిపింది. హెరెలి పండుగ సందర్భంగా జులై 28న ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

దీనిని మానవ అవసరాలకు కాకుండా వ్యవసాయంలో వినియోగించే పురుగుమందుల తయారీ, ఫంగిసైడ్స్ తయారు చేస్తామని పేర్కొంది. ఈ పథకంపై పరిశోధన చేయడానికి, సేకరించే విధానాన్ని అధ్యయనం చేయడానికి ఇప్పటికే ఓ కమిటీ నియమించామని, వారి నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి వివరాలు సమర్పిస్తామని వివరించింది. కాగా, 2020 జూన్‌లో ప్రభుత్వం ఆవు పేడ సేకరణ కోసం గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా పాలు ఇవ్వని, వయసైపోయిన ఆవుల పెంపకం లాభదాయకంగా మారుతుందని ప్రభుత్వ ఉద్దేశం. ఆవుపేడ ద్వారా వర్మీకంపోస్టును ప్రభుత్వం తయారు చేస్తోంది.